జేసీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ స్వరూప..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:25 PM IST
జేసీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ స్వరూప..!
X

అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం నగర మేయర్‌ స‍్వరూప ల మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వివాదాలు నడుస్తున్నాయి.. తాజాగా స్వరూప , దివాకరరెడ్డి పై తీవ్ర విమర్శలు చేసారు.. అయన అభివృద్ధికి అడ్డుపడుతున‍్న రాక్షసుడని వంద కోట‍్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా నల‍్ల అద్దాలు పెట్టుకున‍్న దివాకర్‌ రెడ్డికి అవి కనిపించవని, ఆయన వెంటనే నల‍్ల అద్దాలు తీసి తెల‍్ల అద్దాలు పెట్టుకోవాలని జేసీపై మండిపడ్డారు..

అంతేకాదు అయన కేవలం అనంతపురం అర్బన్ పరిధిలోని తిలక్‌రోడ్‌, సూర‍్యనగర్‌ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్‌ ఎద్దేవా చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హతలేదన్న ఆమె, జేసీ దివాకరరెడ్డి ఎంపీగా ఈ నాలుగేళ్ళ కాలంలో అర్ధరూపాయి కూడా ప్రజలకోసం ఖర్చు పెట్టలేదని విమర్శించారు.. ఇప్పటికైనా రాజకీయాలనుంచి వైదొలిగి ప్రజలకు మనశాంతిని ప్రసాదించాలని స్వరూప సూచించారు..

nanireddy

nanireddy

Next Story