logo
సినిమా

మాయమాటలతో రూ.200కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్

మాయమాటలతో రూ.200కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్
X
Highlights

15ఏళ్లకే మిస్ జమ్మూ కాశ్మీర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనారా గుప్త బోజ్ పురీ సినిమాలు, సీరియల్స్ లో బాగా ఫేమస్. ...

15ఏళ్లకే మిస్ జమ్మూ కాశ్మీర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనారా గుప్త బోజ్ పురీ సినిమాలు, సీరియల్స్ లో బాగా ఫేమస్. 15ఏళ్ల మిస్ జమ్మూ కాశ్మీర్ అవ్వడంతో అవకాశాలు బాగానే వచ్చాయి. ఓపక్క అవకాశాలు మరోపక్క పాపులారిటి సంపాదించింది. ఆ పాపులారిటీనే పెట్టుబడిగా పెట్టి కోట్లు కొల్లగొట్టింది. ఇలా వందలు కాదు వేలు కాదు ఏకంగా మాయమాటలు చెప్పి రూ.200కోట్లు కొల్లగొట్టినట్లు లక్నో పోలీసులు చెబుతున్నారు. సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తామంటూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. అయితే డబ్బుకట్టిన బాధితులు అవకాశాల కోసం తిరగగా ఆమె మోసం చేసిందనే విషయం బట్టబయలైంది. దీంతో కంగుతిన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనారా గుప్తకోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులకు కొన్ని బైర్లు కమ్మే విషయాల్ని వెలుగు చూశారు. మాయమాటలతో డబ్బుల్ని కొల్లగొట్టేందుకు ఓ పదిమంది టీంతో ఆఫీస్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు హీరో అజయ్ దేవగణ్ తో తనకున్న పరిచయాలతో సినీమా అవకాశాలు ఇప్పిస్తామంటూ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 45వేల మందిని చీట్ చేసినట్లు తేలింది. సినీ అవకాశాలు రాకపోవడంతో బాధితులు ఫిర్యాదుతో ఆమె పరారైనట్లు వార్తలు వచ్చాయి. పరారీలో ఉన్న ఆమెకోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే బాధితులు కంగారు పడాల్సిన అవసరం లేదని..త్వరలో అనారాని పట్టుకొని తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Next Story