ధోనితో అమిత్‌షా భేటీ.. కారణం ఏంటంటే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:10 PM IST
ధోనితో అమిత్‌షా భేటీ.. కారణం ఏంటంటే..
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా…. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీతో భేటీ అయ్యారు. సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌ ప్రచారంలో భాగంగా… ఆయన మహీతో సమావేశమయ్యారు. మోడీ సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి… ప్రజల్లోకి వాటిని ఎలా తీసుకెళ్తున్నది తెలిపారు. ఇప్పటికే అమిత్‌ షా… గాయని లతా మంగేష్కర్‌, కపిల్‌దేవ్‌, మాధురీ దీక్షిత్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌, సైనా నెహ్వాల్‌, రామోజీరావు వంటి ప్రముఖులతో సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌లో భాగంగా భేటీ అయ్యారు. ఇదిలావుంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అమిత్‌షా దేశ వ్యాప్తంగా ప్రముఖుల మద్దతు కోరుతున్నారు. ఇటీవల భారతీయ గానకోకిల లతా మంగేష్కర్‌, బాలీవుడ్‌ నటి మాధూరీ దీక్షిత్‌, వ్యాపారవేత్త రతన్‌ టాటా వంటి ప్రముఖులతో​ కూడా అమిత్‌ షా భేటీ అయ్యారు.

nanireddy

nanireddy

Next Story