logo
సినిమా

భారీ రికార్డు సాధించిన అల్లు అర్జున్ 'సరైనోడు'

భారీ రికార్డు సాధించిన అల్లు అర్జున్ సరైనోడు
X
Highlights

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ 'సరైనోడు' యూట్యూబ్ లో భారీ రికార్డ్‌ నమోదుచేసింది. అల్లు...

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ 'సరైనోడు' యూట్యూబ్ లో భారీ రికార్డ్‌ నమోదుచేసింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌కు యూట్యూబ్‌లో 2 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీంతో యూట్యూబ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చలనచిత్రంగా సరైనోడు నిలిచింది. కాగా ఈ చిత్ర హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ను 2017 మే 28న గోల్డ్‌ మైన్స్‌ టెలిఫిలింస్‌ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌ లో పోస్ట్ చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించారు.

Next Story