ప్రపంచానికి చాందిని.. నాకు స్నేహితురాలు..

ప్రపంచానికి చాందిని.. నాకు స్నేహితురాలు..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్య దేవత శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తతో ఎందరో షాకయ్యారు. తమ సొంత మనిషే...

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్య దేవత శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తతో ఎందరో షాకయ్యారు. తమ సొంత మనిషే చనిపోయిందన్నంత బాధపడ్డారు. ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లాడిన ఆమె భర్త బోనీకపూర్ పసిపిల్లాడిలా విలపించారు. శ్రీదేవి లేని తను, తన ఇద్దరు కూతుళ్లు ఎప్పటికీ అంతకు ముందున్నట్టు జీవించలేమని చెప్పారు. శ్రీదేవి అంత్యక్రియల అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు.

అతిలోక సుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాక ఆమె భర్త బోనీ కపూర్ ప్రకటన విడుదల చేశారు. అందులో శ్రీదేవి లేని జీవితాన్ని ఊహించలేక పోతున్నానన్న బోనీ, ఈ దు:ఖ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. ఆ ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ మంచి స్నేహితురాలిని, భార్యను, ఇద్దరు వయసొచ్చిన కూతుళ్లకు తల్లిని కోల్పోవడం మాటల్లో వర్ణించలేనిది.

ఈ కష్టకాలంలో నా వెన్నంటి నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి, స్నేహితులకు, సహచరులకు, శ్రేయోభిలాషులకు, నా శ్రీదేవికి ఉన్న అసంఖ్యాక అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో నాకు, ఖుషీ, జాన్వీలకు తమ మద్దతు, ప్రేమ అందించిన అర్జున్, అన్షులాలు నా పక్కనే ఉండటం నా అదృష్టం. ఓ కుటుంబంగా కలిసికట్టుగా నిలిచి ఈ తీర్చలేని నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు ప్రయత్నించాం.

ప్రపంచానికి ఆమె వాళ్ల చాందినీ...అద్భుత ప్రతిభ కల నటి... వాళ్ల శ్రీదేవి. కానీ నాకు ఆమె నా ప్రేమ, నా స్నేహితురాలు, నా కూతుళ్లకు తల్లి నా భాగస్వామి. మా కూతుళ్లకు ఆమె సర్వస్వం వాళ్ల జీవితం. ఆమె అనే ఇరుసు చుట్టూ నా కుటుంబం తిరిగేది.

నాకెంతో ప్రేమాస్పదురాలైన భార్యకు, ఖుషీ..జాన్వీల తల్లికి తుదిసారి వీడ్కోలు పలికిన సందర్భంగా అందరికీ నాదో విన్నపం. ఈ బాధాతప్త సమయంలో దయచేసి మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి. మీరు శ్రీ గురించి మాట్లాడాలంటే, ఆమెను మీలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొనే ప్రత్యేకమైన స్మృతులను గురించి మాట్లాడండి. ఒక నటిగా ఆమె స్థానం అప్పటికీ, ఇప్పటికీ భర్తీ చేయలేనిది. ఆమెను ఆమె నటన కౌశలం ఆధారంగా ప్రేమించి గౌరవించండి. ఒక నటి నటజీవితంపై ఎప్పటికీ తెర పడదు, ఎందుకంటే వాళ్లు వెండితెరపై ఎప్పటికీ వెలుగులీనుతూనే ఉంటారు.

నా కూతుళ్లను సంరక్షించుకోవడమే ఇప్పుడు నా ముందున్న బాధ్యత. శ్రీ లేకుండా ఆ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. ఆమె మా జీవితం, మా బలం, మా చిరునవ్వులకు కారణం. మేము ఆమెను అంతు లేనంతగా ప్రేమిస్తున్నాం.

రెస్ట్ ఇన్ పీస్, మై లవ్. మా జీవితాలు మళ్లీ ఎప్పటికీ మామూలుగా ఉండబోవు.

బోనీ కపూర్

Show Full Article
Print Article
Next Story
More Stories