గుంటూరు జిల్లాలో మరో ఘోరం చిన్నారిపై అత్యాచారం..

గుంటూరు జిల్లాలో మరో ఘోరం చిన్నారిపై అత్యాచారం..
x
Highlights

దాచేపల్లిలో ఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆదివారం చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి...

దాచేపల్లిలో ఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆదివారం చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్‌మీరా అనే యువకుడు లైంగిక దాడి జరిపాడు. బాలికకు నాగుల్‌మీరా వరసకు బావ అవుతాడు... ఇంట్లో అందరూ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు ఇంతలో బాలికపై కన్నేసిన నాగుల్ మీరా చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప ఏడుస్తుండటం చూసి విచారించసాగారు. ఇంతలో బాలిక అస్వస్థకు లోనవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు
వైద్యులు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories