కాంగ్రెస్ ను చావు దెబ్బ‌తీయ‌నున్న బీజేపీ

కాంగ్రెస్ ను చావు దెబ్బ‌తీయ‌నున్న బీజేపీ
x
Highlights

బోఫోర్స్ భూతం మళ్లీ పైకి లేస్తోందా? సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఢిల్లీ హైకోర్టు12 ఏళ్ల క్రితం కొట్టేసిన ఈ కేసును సీబీఐ మళ్లీ తిరగదోడుతోంది. 2019...

బోఫోర్స్ భూతం మళ్లీ పైకి లేస్తోందా? సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఢిల్లీ హైకోర్టు12 ఏళ్ల క్రితం కొట్టేసిన ఈ కేసును సీబీఐ మళ్లీ తిరగదోడుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ కేసు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుందా?

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ మళ్లీ బోఫోర్స్ భూతాన్ని వెలికి తీస్తోందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. 2005లో సరైన ఆధారాలు లేవన్న కారణంగా ఢిల్లీ హై కోర్టు కొట్టి పారేసిన ఈ కేసును సీబీఐ మళ్లీ తవ్వుతోంది.. తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. 12 ఏళ్ల తర్వాత ఈ కేసును మళ్లీ వెలికి తీయడం మంచిది కాదంటూ అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ ఈ మధ్య కామెంట్ కూడా చేశారు.. అయితే సీబీఐ ఈ సారి కొన్ని కీలక డాక్యుమెంట్లను సంపాదించడంతో కేసు విచారణను మళ్లీ తవ్వి తీయాలని భావించింది. దాంతో సుప్రీం కోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తోంది.

మాయని మచ్చలాటి ఈ కేసు వల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం కోల్పోయింది.. సోనియా కుటుంబంపై ఈ అవినీతి మరక చెరిగిపోయిందని భావిస్తున్న తరుణంలో సీబీఐ మళ్లీ తవ్వుతుండటంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సరిహద్దుల్లో శత్రు సేనల సంహరణకు అత్యాధునికమైనవంటూ బోఫోర్స్ గన్ లను రాజీవ్ ప్రభుత్వం ఇటలీనుంచి కొనుగోలు చేసింది. అయితే అవి నాణ్యత పరంగా తుప్పుపట్టిన చెత్త తుపాకులని విమర్శలొచ్చాయి.. వీటి కొనుగోలు కోసం దాదాపు 64 కోట్లు ముడుపులుగా చెల్లించినట్లుగా అభియోగాలున్నాయి.. కేసు విచారణలో ఉండగానే అటు రాజీవ్ , దళారీగా పనిచేసిన అట్టావియో ఖత్రోకి కూడా చనిపోవడం, సరైన ఆధారాలు లేని కారణంగా అప్పట్లో కేసును కొట్టేశారు. ఈకేసులో ఆరోపణలెదుర్కొంటున్న హిందూజా సోదరులకు కూడా విముక్తి దొరికింది. కానీ ఇప్పుడు మళ్లీ తవ్వి తీయడమంటే.. రాజకీయ కక్షేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపికీ ఆదరణ తగ్గుతుండటంతో కమలనాథులే ఈ అంశాన్ని మళ్లీ కెలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories