టీజేఎస్‌ లో చేరిన రచనారెడ్డి.. చేరిన వెంటనే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
టీజేఎస్‌ లో చేరిన రచనారెడ్డి.. చేరిన వెంటనే..
X

ప్రభుత్వం తీసుకున్న పలు చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై కోర్టుల్లో పోరాడుతున్న ప్రముఖ అడ్వకేట్‌ రచనారెడ్డి తెలంగాణ జనసమితిలో చేరారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా పార్టీలో చేరిన అనంతరమే రచనారెడ్డిని టీజేఎస్‌ ఉపాధ్యక్షులుగా నియ మిస్తున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. ఆమెతో పాటుగా ప్రొ.విశ్వేశ్వర్‌రావు, బకృద్దీన్‌లను టీజేఎస్‌ ఉపాధ్యక్షులుగా కోదండరామ్ నియమించారు. కోదండరాం మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ పెద్ద అవివేకి అని విమర్శించారు. ఇలాంటి ఆలోచనను కేసీఆర్‌ ఎందుకు చేశారోనని ప్రజలకు అర్ధం కావడం లేదని.. రానున్న ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన శాస్తి చేస్తారని విమర్శించారు.

nanireddy

nanireddy

Next Story