logo
సినిమా

హీరోయిన్ ఆదాశర్మ పడుతున్న కష్టం చూస్తే..

హీరోయిన్ ఆదాశర్మ పడుతున్న కష్టం చూస్తే..
X
Highlights

'ఆదాశర్మ' హీరోయిన్ గుర్తు ఉండే ఉంటుంది. తెలుగమ్మాయి అయినా..బాలీవుడ్ లో స్థిరపడింది. లవర్ బాయ్ నితిన్ సరసన ...

'ఆదాశర్మ' హీరోయిన్ గుర్తు ఉండే ఉంటుంది. తెలుగమ్మాయి అయినా..బాలీవుడ్ లో స్థిరపడింది. లవర్ బాయ్ నితిన్ సరసన హార్ట్ ఎటాక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో చేసినా అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. ఆఖరికి అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరమైన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి ఆఫర్లే సాధిస్తోంది. ఇటీవల ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా ఆదా నటించడానికి ఒప్పుకుందట. అందులో ఆదా పాత్ర కూరగాయలు అమ్మే సాధారణ మహిళ పాత్ర అట. ఇక దీనికోసం ఆదాశర్మ తో ఓ ఫోటో షూట్ కూడా చేయించారు. ఆదాశర్మ రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఆదా శర్మ ఇలా మారిపోయిందేంటి.. ఎందుకింతలా కష్టపడుతుందని అని అనుకోవడం కొసమెరుపు.

Next Story