కండోమ్‌లు బ్యాన్‌ చేస్తే ఆమె పోతుంది : నటి రాఖి సావంత్

nanireddy
Updated on: 24 Dec 2018 1:50 PM IST
కండోమ్‌లు బ్యాన్‌ చేస్తే ఆమె పోతుంది : నటి రాఖి సావంత్
X

మహారాష్ట్రలో ప్లాస్టిక్ బ్యాన్ వ్యవహారం ఇద్దరు నటీమణుల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. సాధారణంగానే మాట కాస్త కరుగ్గా వినిపించే రాఖి సావంత్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరి బండబూతులు తిట్టింది. దీంతో ఓ సీరియల్ నటి అవాక్కయింది.

అసలు వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలో ప్లాస్టిక్‌ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ నటి రాఖి సావంత్ ఓ పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. దీంతో సీరియల్‌ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌పై కామెంట్ చేశారు.. 'సోదరి.. ప్లాస్టిక్‌ బ్యాన్‌ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్‌ అయ్యాయా?' అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీ సావంత్ కి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. 'కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్‌ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్‌ వచ్చి పోతారు' అంటూ పోస్ట్ చేశారు. దీంతో అవాక్కయిన మహికా రాఖీని తిడుతూ మరో పోస్ట్ పెట్టింది. ఆ తరువాత ఇద్దరి మధ్య కాసేపు సోషల్ మీడియా వార్ నడిచింది.

Actress Rakhi Sawant Abuses TV Actress Mahika - Sakshi

nanireddy

nanireddy

Next Story