తనకు బ్లడ్ కాన్సర్ ఉందన్న వార్తపై నటి రాధికా ఏమన్నారంటే!

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
తనకు బ్లడ్ కాన్సర్ ఉందన్న వార్తపై నటి రాధికా ఏమన్నారంటే!
X

సోషల్ మీడియాలో ఏది మంచో ఏది చెడో అర్ధం కాక సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం అవాక్కవుతున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై మరీ ఘోరంగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన నటీమణి రాధిక గురించి సోషల్ మీడియాలో ఓ వార్త దావానంలా వ్యాపించింది. ఆమెకు బ్లడ్ కాన్సర్ ఉన్నట్టు ప్రస్తుతం ఆమె ప్రమాదంలో ఉన్నారని దాని సారాంశం.. ఇక ఇదే వార్తలపై ఓ అభిమాని రాధికకు ట్వీట్ చేశాడు. ఆమె దానికి స్పందిస్తూ.. ‘అది నిజం కాదు.. కల్పితం’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆ వైరల్ వార్తకు బ్రేక్ పడింది.

nanireddy

nanireddy

Next Story