రాజేంద్ర ప్రసాద్ భార్య నా కూతురే : నటి రమాప్రభ

nanireddy
Updated on: 24 Dec 2018 2:00 PM IST
రాజేంద్ర ప్రసాద్ భార్య నా కూతురే : నటి రమాప్రభ
X

టాలీవుడ్ లో అగ్ర హాస్య నటీమణుల్లో రమాప్రభ ఒకరు. మహామహుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటిగా నటించారు. ఆమె తమ్ముడిగా భావించే దివంగత నటుడు రాజబాబు తోనే దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రేలంగి తదితరుల పక్కన ప్రాముఖ్యత కలిగిన క్యారెక్టర్ లలో మెప్పించారు. సినిమాల్లో నటిస్తూనే ప్రముఖ నటుడు శరత్‌ బాబును ప్రేమ వివాహం చేసుకున్న రమాప్రభ 13 ఏళ్ల కాపురం తరువాత విడిపోయారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. రుక్కువగా మదనపల్లెలో ఉండే రమాప్రభ షూటింగులు ఉంటే తప్ప నగరానికి రారు.. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో ఓ ఆసక్తికర విషయం వెళ్లడించారు. నటుడు రాజేంద్రప్రసాద్ తన అల్లుడని..ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకున్నానని ఆమెను రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశానని ఈ లెజెండరీ నటీమణి వెల్లడించారు.

nanireddy

nanireddy

Next Story