పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

nanireddy
Updated on: 24 Dec 2018 2:54 PM IST
పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
X

బియ్యం లోడ్‌ తో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన జనగామలో జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి 2 గంటల సమయంలో బియ్యం లోడ్‌ చేసుకుని సికింద్రాబాద్‌ వెళుతున్న గూడ్స్.. వ్యాగన్‌ పాయింట్‌ లైన్‌పై పట్టాలు తప్పింది. దీంతో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పడంతో హుటాహుటిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఉన్నతాధికారులు జనగామకు చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగతా బోగీలను సికింద్రాబాద్‌కు పంపించేశారు. ప్రస్తుతం మిగిలిన పట్టాలను యధాస్థితికి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

nanireddy

nanireddy

Next Story