బందరు కాలువలో పడిన కారు.. ఎస్సై దుర్మరణం

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
బందరు కాలువలో పడిన కారు.. ఎస్సై దుర్మరణం
X

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ ఎస్సై దుర్మరణం పాలయ్యాడు. ఘంటసాల మండలంలో కరకట్టపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి అవనిగడ్డ ఓ కారు వేగంగా వస్తోంది. ఈ క్రమంలో పాపవినాశనం వద్ద అదుపుతప్పి కరకట్ట పై నుంచి పక్కనే ఉన్న బందరు కాలువలోకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడగలిగారు. కానీ డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి కాలువలో గల్లంతయ్యాడు. కాగా అతను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కోట వంశీగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story