వంటగదిలో పాములు..

nanireddy
Updated on: 24 Dec 2018 1:59 PM IST
వంటగదిలో పాములు..
X

ఒకటికాదు రెండుకాదు ఏకంగా 60 పాములు ఒకేచోట చేరాయి.. వంటచేయడానికని వెళ్లిన పనిమనిషి వీటిని చూసి షాకైంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా జెడ్పీ స్కూలులోని వంట గదిలో ఉంచిన కట్టెలు తీసుకునేందుకు వంటమనిషి వెళ్లింది. కట్టెలు కదిలిస్తుండగా రెండు పాములు కనిపించాయి. దీంతో కంగారుపడినా మిగతా కట్టెల్ని తొలగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కుప్పలు తెప్పలుగా ఆ కట్టెలలోనుంచి పాములు పాక్కుంటూ వచ్చాయి. మొత్తం 60 పాములు బయటపడ్డాయి. దీంతో సదరు మహిళ స్కూల్‌ సిబ్బంది సమాచారం అందించారు. వారు పిల్లల్ని దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న విక్కీ దలాల్ చాకచక్యంగా వాటన్నింటిని పట్టుకుని బంధించాడు.

nanireddy

nanireddy

Next Story