Top
logo

చెన్నై నగరంలో ఘోరం..

చెన్నై నగరంలో ఘోరం..
X
Highlights

తమిళనాడు చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు నయవంచన చేశాడు. పుదుచ్చేరికి...

తమిళనాడు చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు నయవంచన చేశాడు. పుదుచ్చేరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుని కుమార్తె (17) చెన్నై నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు. కొద్దీ కాలానికే వారిమధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. అంతేకాకుండా తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ కూడా రేప్ చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story