Maha Shivaratri 2026 Live Updates: శ్రీ... ... Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivaratri 2026 Live Updates: శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమవతి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సిద్దేశ్వర స్వామి (శివుని ఆలయంలో) బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

ఈ హేమావతి ఆలయం ప్రత్యేకత ఏమంటే శివుడు లింగాకారంలో కాకుండా, మానవాకారంలో ఉండడం ఈ ఆలయ విశేషం.

మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ శివున్ని దర్శించడానికి ఉదయాన్నే అంద్ర నుంచే కాకుండా కర్ణాటక నుండి భారీ గా తరలివచ్చారు భక్తులు.

ఈ హేమావతి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా నేడు రుద్రాభిషేకం, అఖండపూజలు నిర్వహించారు అర్చకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories