పోతిరెడ్డి పాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన కొత్త... ... ఈరోజు (మే-17-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-17 01:54:31

పోతిరెడ్డి పాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన కొత్త నీటి పథకానికి సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. ఈ విషయాన్ని ఆయన తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు రాసిన లేఖలో తెలిపారు.కొత్త నీటి పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని.. అప్పటివరకు ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీని కోరాలని చెప్పామని మంత్రి పేర్కొన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తన లేఖలో వివరించారు.

HMTV

HMTV

Next Story