తూర్పుగోదావరి జిల్లా : కొత్తపేటలో లాక్ డౌన్ సమయంలో... ... ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-15 12:05:33

తూర్పుగోదావరి జిల్లా : కొత్తపేటలో లాక్ డౌన్ సమయంలో ఉదయం 10 గంటలు దాటిన తరువాత నిభంధనలను అతిక్రమించి అనవసరంగా బయట బైక్ లపై తిరుగుతున్న సుమారు 50 పైగా మోటార్ సైకిళ్ళు ను కొత్తపేట ఎస్.ఐ కె.రమేష్ తన సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అనంతరం వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కొత్తపేట లో రెడ్ జోన్ ఉన్న కారణంగా మేము ఇచ్చిన టైం ప్రకారం ఉదయం 6 నుండి 10 గంటల లోపులో ఎవరికి వారు నిత్యావసర తదితర వస్తువులు కొనుగోలు చేసుకుని ఎవరి ఇళ్లకు వారు పెళ్ళిపోవాలని సూచించారు. ఉదయం 10 తరువాత అనవసరంగా బయట తిరిగితే వారి బైక్స్ ను సీజ్ చేయడంతో పాటుగా వారిని క్వారంటీన్ కు పంపిస్తామని హెచ్చరించారు.



 


HMTV

HMTV

Next Story