భువనగిరి జిల్లాకు తిరిగి వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్
భువనగిరి జిల్లా : మహారాష్ట్రకు వలస వెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లాకు తిరిగి వచ్చిన వారిలో మరో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వీటిని యాదాద్రి భువనగిరి జిల్లాలో కాకుండా వలస కూలీల జాబితాలో చేర్చారు. ఆత్మకూరు ఎం మండలంలో ఐదుగురు, చౌటుప్పల్ పురపాలిక పరిధిలో నలుగురు, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు, మోటకొండూరు మండల కేంద్రంలో ఒకరు వ్యాధి బారిన పడ్డారు. ఇందులో ఆత్మకూరు, మోటకొండూరుకు చెందిన వారు మినహా మిగతావారు జిల్లాలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు.మోటకొండూరుకు చెందిన కరోనా బాధితురాలు ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో ఈ నెల 9న రాత్రి నాందేడ్ నుంచి వచ్చారు. వారితోపాటు వచ్చిన మరో ముగ్గురిని 10న ఉదయం క్వారంటైన్‌కు తరలించారు. పరీక్షల్లో ఆమెకు మాత్రమే పాజిటివ్ రావడంతో నిన్న మరో 13 మందిని బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్‌కు పంపించారు. ఆత్మకూరు మండలానికి సంబంధించి ఇప్పటివరకు 13 మందిని హైదరాబాద్‌కు పంపించగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. వారి కాంటాక్ట్‌లను పరిశీలించి మరో 30 మందిని హోం క్వారంటైన్‌కు ఆదేశించారు..



