ఒకటి నుంచి నిట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు

HMTV
By HMTV
Published on: 2020-05-20 06:30:54

ఏపీ నిట్‌లో బీటెక్‌ చివరి సంవత్సర విద్యార్థులకు జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావు మంగళవారం తెలిపారు. పరీక్షలు ఐదు రోజులు పాటు కొనసాగుతాయని, గేట్‌ మోడల్‌లో నిర్వహిస్తామని చెప్పారు.

చివరి సంవత్సర విద్యార్థుల్లో కొందరు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపికవడంతో తుది ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకోనున్నాయి. దాంతో ముందుగానే చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు

HMTV

HMTV

Next Story