గుంటూరు మిర్చి యార్డులో క్రయ విక్రయాలకు సన్నాహాలు

HMTV
By HMTV
Published on: 2020-05-19 06:16:50

గుంటూరు మిర్చి యార్డు క్రయ విక్రయాల పునః ప్రారంభ అంశంపై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కన్నబాబు.

మార్కుఫెడ్ కార్యాలయం లో మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులు, ట్రేడర్ లు, కమిషన్ ఏజెంట్స్ లతో ఆయన సమావేశం నిర్వహించారు.

కరోనా వల్ల ముతబడ్డ ఈ మిర్చి యార్డు లో క్రయ విక్రయాలు ఆపేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుత లాక్డౌన్ సడలింపు ల నేపథ్యంలో మిర్చి యార్డు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సిబ్బంది తో సామాజిక దూరాన్ని వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ క్రయ విక్రయాలకు అవకాశం వుండేలా ప్రయత్నాలు జరపాలని అధికారులు సూచించారు.

ముందుగా  కొద్ది కొద్దిగా క్రయ విక్రయాలు చేస్తే బాగుంటుందని పలువురు సూచనలు చేశారు.

గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో మార్కెట్ యార్డులో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలు కు తగిన చర్యలను తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

HMTV

HMTV

Next Story