వెబ్సైట్ లో ఏపీ పదోతరగతి నమూనా ప్రశ్నా పత్రాలు

HMTV
By HMTV
Published on: 2020-05-19 03:49:30

ఆంధ్ర ప్రదేశ్ పదోతరగతి పరీక్షలు కరోనా తొ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మిగిలిన పరీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకు ముందు ఒక్కో సబ్జెక్టు లోనూ రెండు పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి అలాకాకుండా ఒకే పరీక్ష నిర్వహించేలా మార్పులు చేశారు. దీంతో పరీక్షా పత్రం ఎలా ఉంటుందో అని విద్యార్థులకు అనుమానాలు ఉండేవి. వాటిని తీర్చడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

- వెబ్ సైట్ లో  ఆంధ్రప్రదేశ్ పదో తరగతి నమూనా పత్రాలు

- పేపరు మార్పులకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను దీనిలో చూడవచ్చు.

- www.bseap.org వెబ్ సైట్ నుంచి ఈ మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.



 



HMTV

HMTV

Next Story