Women Loan: మహిళలకి అలర్ట్‌.. ఈ పనికోసం సులువుగా 25 లక్షల వరకు రుణం..!

Women Can Easily Loan up to 25 Lakhs to Start a Business Know How
x

Women Loan: మహిళలకి అలర్ట్‌.. ఈ పనికోసం సులువుగా 25 లక్షల వరకు రుణం..!

Highlights

Women Loan: నేటి కాలంలో మహిళలు అనేక రంగాల్లో గొప్ప పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు.

Women Loan: నేటి కాలంలో మహిళలు అనేక రంగాల్లో గొప్ప పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. వ్యాపార రంగంలో పురుషులతో పోలిస్తే మహిళల స్థానం ఇంకా వెనుకబడే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి ప్యాకేజీ యోజన ప్రారంభించింది. దీనికింద మహిళలు సహాయంగా రూ.25 లక్షల వరకు రుణం పొందుతారు. దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి ప్యాకేజీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో దేశం నలుమూలల నుంచి మహిళలు లబ్ధిదారులు కావచ్చు. స్త్రీ శక్తి ప్యాకేజీ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారు. ఇది చాలా సులువుగా జరుగుతుంది. స్త్రీ శక్తి ప్యాకేజీ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా శాఖను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రుణం తీసుకునే మహిళకు ఆ వ్యాపారంలో కనీసం 50 శాతం యాజమాన్యం ఉండాలి.

రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే మహిళలకు వడ్డీ రేటు 0.5% తగ్గుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో నమోదైన కంపెనీలకు రుణ పరిమితి 50 వేల నుంచి 25 లక్షల వరకు ఇస్తారు. స్త్రీ శక్తి ప్యాకేజీ యోజనలో వడ్డీని ఐదు శాతం లేదా అంతకంటే తక్కువ రేటుతో వసూలు చేస్తారు. ఐదు లక్షల వరకు రుణం తీసుకునేందుకు ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్త్రీ శక్తి ప్యాకేజీ పథకం వల్ల మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోంది. స్త్రీ శక్తి ప్యాకేజీ యోజన ప్రయోజనం కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు. ఒక కంపెనీ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు అందులో మహిళల యాజమాన్యం 50 శాతానికి మించి ఉండాలి.

ఈ పత్రాలు అవసరం

ఆధార్ కార్డు, ఓటరు ID,బ్యాంక్ ఖాతా వివరాలు, ఈ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్,

అన్ని వ్యాపార సంబంధిత పత్రాలు ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories