చనిపోయిన వ్యక్తుల ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ కార్డులు పనిచేస్తాయా.. తెలుసుకోండి..!

After death ID Cards: ఈ దేశంలో ఒక వ్యక్తి ఏ పనిచేయాలన్నా ప్రభుత్వం గుర్తించిన గుర్తింపుకార్డులు ఉండాలి.

Arun Chilukuri
Published on: 1 March 2023 11:57 AM IST
What Happens to Aadhaar PAN and Voter ID After Death Know or Face Trouble
X

చనిపోయిన వ్యక్తుల ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ కార్డులు పనిచేస్తాయా.. తెలుసుకోండి..!

After death ID Cards: ఈ దేశంలో ఒక వ్యక్తి ఏ పనిచేయాలన్నా ప్రభుత్వం గుర్తించిన గుర్తింపుకార్డులు ఉండాలి. ఇవిలేనిదే ఏ పని జరగదు. అందులో ముఖ్యమైనవి ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ వస్తాయి. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా, ఓటుహక్కు వినియోగించుకోవాలన్నా, పిల్లల్ని స్కూల్‌లో చేర్పించాలన్నా, పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా ఇంకా చాలా పనులకి వీటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇటువంటి ముఖ్యమైన పత్రాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇవి దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి ముఖ్యమైన పత్రాల సమాచారం ఎవ్వరికీ అంచించకూడదని తరచుగా ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడి గుర్తింపు కార్డులని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పెద్ద నష్టం జరగవచ్చు. అప్పుడు ఆ పత్రాలను ఏంచేయాలనే ప్రశ్న అందరిలో మెదులుతూనే ఉంటుంది. దానికి సమాధానం తెలుసుకుందాం.

పాన్ కార్డ్

2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాన్ కార్డ్ ఇప్పుడు వ్యాపార IDగా మారిందని ప్రకటించారు. ఏదైనా ఆర్థిక పనిని పూర్తి చేయాల్సి వస్తే దీని కోసం పాన్ కార్డ్ కలిగి ఉండటం అవసరం. ఈ పరిస్థితిలో ఎవరైనా మరణించిన తర్వాత పాన్ కార్డును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుది. కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే ఆదాయపు పన్ను శాఖను సంప్రదించి వెంటనే అతని పాన్ కార్డును సరెండర్ చేయాలి. సరెండర్ చేయడానికి ముందు ఈ కార్డ్‌కి లింక్ చేసిన అన్ని ఖాతాలను ఇతరుల పేరుకు బదిలీ చేయాలి.

ఆధార్ కార్డు

UIDAI జారీ చేసిన ఆధార్ కార్డ్ యూనివర్సల్ ID. ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన పత్రం. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి మరణిస్తే అతని ఆధార్ కార్డును సరెండర్ చేసే అవకాశం ప్రస్తుతం లేదు. కానీ మీరు దాన్ని లాక్ చేయవచ్చు. తద్వారా ఎవరూ దుర్వినియోగం చేయకుండా కాపాడవచ్చు.

ఓటరు ID

ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు కార్డు ఉపయోగపడుతుంది. అందుకే 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి దీన్ని కలిగి ఉండటం ముఖ్యం. మరోవైపు ఒక వ్యక్తి మరణిస్తే అతని ఓటరు గుర్తింపు కార్డును రద్దు చేయవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఫారం-7 నింపాలి. తర్వాత ఆ వ్యక్తి ఓటర్ ఐడీ రద్దు అవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story