Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Stock Market: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన దేశీ సూచీలు .

Sandeep Eggoju
Published on: 3 Jun 2021 10:52 AM IST
Today Stock Market Open With Nifty 93 Points and Sensex 264 Points 03 06 2021
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన దేశీ సూచీలు అదేబాటన దూకుడుగా కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 264 పాయింట్లు ఎగసి 52,114 వద్దకు చేరగా , నిఫ్టీ 93 పాయింట్ల మేర లాభంతో 15,669 వద్ద కదలాడుతున్నాయి.కాగా గత రెండు సెషన్లలో అక్కడికక్కడే ముగిసిన దేశీ సూచీలు ..తాజా సెషన్ లో తిరిగి బౌన్స్ బ్యాక్ కావడంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడినట్లయింది. మరోవైపు ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు శుక్రవారం వెల్లడి కానుండగా ఈసారీ కీలక రేట్ల జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఎదురవుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story