Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Equity Market: తాజా వారం తొలి సెషన్ లో లాభాల ఓపెనింగ్ * గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం

Sandeep Eggoju
Published on: 7 Jun 2021 11:05 AM IST
Today Stock Market Open With Nifty 50 Points and Sensex 100 Points 07 06 2021
X

Representational Image

Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..తాజా వారం తొలి సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు లాభాల బాటన కొనసాగుతున్నాయి.. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా జంప్ చేయగా నిఫ్టీ 15,700 పాయింట్ల ఎగువకు చేరింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్ల మేర లాభంతో 52,132 వద్దకు చేరగా నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 15,702 వద్ద కదలాడుతున్నాయి. తాజా వారంలోనూ మార్కెట్లు సానుకూల బాటన కొనసాగిన పక్షంలో భారత మార్కెట్లలో వరుసగా నాలుగో వారం ర్యాలీ నమోదవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story