Petrol Rate: దేశవ్యాప్తంగా మరోమారు పెరిగిన ఇంధన ధరలు

Petrol Rate: ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ,డీజిల్ ధరలు * పెట్రోల్ 30 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంపు

Sandeep Eggoju
Published on: 31 May 2021 10:20 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 31 05 2021
X

Representational Image

Petrol Rate: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోమారు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా ఈరోజు పెట్రోల్ ధర 30 పైసలు డీజిల్ ధర 29 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 97.93 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 92.83 వద్ద కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 94 రూపాయల 23 పైసలుగా వుండగా డీజిల్ ధర 85 రూపాయల 15 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది...తెలగాణలోని అన్ని జిల్లాల్లో వంద రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు పెట్రోల్‌ లీటరు పై 3 రూపాయల 83 పైసలు , డీజిల్ పై 4 రూపాయల 42 పైసలు చొప్పున పెరిగాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story