Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరల పరుగులు

Petrol and Diesel Price: ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ,డీజిల్ ధరలు * హైదరాబాద్ లో సెంచరీ మార్క్ దాటి పరుగులు

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 10:18 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 26 06 2021
X
Representational Image

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. శనివారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 36 పైసలు,డీజిల్‌ పై 38 పైసలు చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 101 రూపాయల 96 పైసలు వద్దకు చేరగా డీజిల్‌ ధర 96 రూపాయల 63 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 104 రూపాయల మార్క్ ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 98 రూపాయల 11 పైసలుగా వుండగా డీజిల్ ధర 88 రూపాయల 65 పైసలు వద్దకి చేరింది..దేశంలోని ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story