Petrol Rate: దేశంలో స్థిరంగా పెట్రో ధరలు

Petrol Rate: ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ,డీజిల్ ధరలు

Sandeep Eggoju
Published on: 15 Jun 2021 10:47 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 15 06 2021
X

Representational Image 

Petrol Rate: శంలో పెట్రో ధరలు స్థిరంగా,నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి..హైదరాబాద్ లో సెంచరీ మార్క్ దాటగా ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల ఎగువకు చేరింది.....ముంబై లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల 58 పైసల వద్దకు చేరగా డీజిల్ ధర 94 రూపాయల 70 పైసలుగా నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 96 రూపాయల 41 పైసలుగా వుండగా. డీజిల్ ధర 87 రూపాయల 28 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది..ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 100.20 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 95.14 వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story