Petrol And Diesel Price: మరోసారి పెరిగిన చమురు ధరలు

Petrol And Diesel Price: లీటర్ పెట్రోల్ పై 27పైసలు, డీజిల్ పై 24 పైసలు పెంపు

Sandeep Eggoju
Published on: 12 Jun 2021 10:26 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 12 06 2021
X

Representational Image

Petrol And Diesel Price: వాహనదారులకు చమురు సంస్థలు చుక్కలుచూపిస్తున్నాయి. రోజురోజుకూ ధరలను పెంచుతూ షాక్‌ ఇస్తున్నాయి. మే నుంచి వరుసగా రేట్ల పెంచుతున్న చమురు సంస్థలు సామాన్యుడిపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా మరోసారి పెట్రో ధరలను పెంచాయి చమురు సంస్థలు. ఇవాళ పెట్రోల్‌పై 27, డీజిల్‌పై 24 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రో ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో లీటర్ ధర వంద క్రాస్ చేసింది. చిత్తూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 103కు చేరగా.. గుంటూరు, విజయవాడ,శ్రీకాకుళం, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో 102 రూపాయలు క్రాస్ చేసింది. ఇక ప్రీమియం పెట్రోల్ ధర 106 రూపాయలకు చేరువలో ఉంది. అటు డీజిల్ ధరలు కూడా క్రమంగా సెంచరీకి చేరువవుతున్నాయి.

ఇక తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలోనూ పెట్రోల్‌ సెంచరీకి చేరువైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 90పైసలకు చేరింది. డీజిల్ ధరలు 94 రూపాయల 82 పైసలుగా ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story