Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి, వెండి ధరలు

Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 28 Oct 2021 12:00 PM IST
Today Gold Rate 28 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి, వెండి ధరలు 

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గి పసిడి ధర రూ.48,660 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 తగ్గుదలతో రూ.44,600 కు చేరింది. ఇలా పసిడి ధర పడిపోగా వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. వెండి రేటు కూడా 200 రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రూ.71,900 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.02 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1799 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం పెరిగి ఔన్స్‌కు 0.34 శాతం పెరుగుదలతో 24.72 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story