Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో విలువైన లోహం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 14 May 2021 11:51 AM IST
Today Gold Rate 14 05 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో విలువైన లోహం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే 24 క్యారెట్ల పుత్తడి ధర 50 వేల రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. కొవిడ్‌ ప్రకంపనల నేపధ్యంలో లాక్ డౌన్లు , వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగమనం వెరసి మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 45,900 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 44,720 రూపాయలుగా నమోదవుతోంది. హైదరాబాద్, విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,500 కాగా 24 క్యారెట్ల ధర 48,560 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కేజీ ధర స్వల్పంగా తగ్గి 75 వేల 900 రూపాయలుగా నమోదవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story