Today Gold, Silver Rates: నిలకడగా పసిడి.. తగ్గిన వెండి ధరలు

Today Gold, Silver Rates: నిలకడగా పసిడి.. తగ్గిన వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 12 Oct 2021 10:31 AM IST
Today Gold Rate 12 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా పసిడి ధర రూ.47,890 వద్ద ఉంది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో కూడా సోమవారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకపోవడంతో రూ.43,900 వద్ద నిలకడగా ఉంది. ఇలా పసిడి ధర తటస్థంగా ఉండగా వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. వెండి రేటు కేజీకి 100 రూపాయలు తగ్గి కిలో వెండి ధర రూ.65,800 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర నిలకడగా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.24 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1751 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా తగ్గడంతో ఔన్స్‌కు 0.55 శాతం తగ్గుదలతో 22.54 డాలర్లకు పడిపోయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story