Top
logo

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold and Silver Rates
X

బంగారం, వెండి ధరలు

Highlights

Gold Rate : దేశంలో కొన్ని రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

Gold Rate : దేశంలో కొన్ని రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఫిబ్రవరి 10న రూ.46,900గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర, ఫిబ్రవరి 19వ తేదీ నాటికి రూ.45,150కి చేరుకుంది. మళ్లీ గత రెండు రోజుల నుంచి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. నేడు (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.590 పెరిగి రూ.46,000కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ. 47,840కు చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా రూ.590 పెరిగి రూ.43,850కు చేరుకుంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.72,300కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌ లో గోల్డ్ రేట్లకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ ధరలు హెచ్చు తగ్గులకు గురి అవుతాయి. మున్ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-02-2021 సాయంత్రం 4 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Web TitleToday Gold and Silver Rates
Next Story