పది రూపాయల నెమలి నోటు చాలా అరుదు.. మీ దగ్గరుంటే ధనవంతులు అయిపోతారు..!

Ten Rupee Peacock Note: ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది.

Arun Chilukuri
Updated on: 8 Feb 2023 2:00 PM IST
This Ten Rupee Peacock Note is Very Rare If you Have it you Will Become Rich
X

పది రూపాయల నెమలి నోటు చాలా అరుదు.. మీ దగ్గరుంటే ధనవంతులు అయిపోతారు..!

Ten Rupee Peacock Note: ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. వీటి సహాయంతో లావాదేవీలు జరుగుతాయి. అయితే చాలా దేశాలు కరెన్సీలో అప్‌డేట్‌లు చేస్తుంటాయి. భారతీయ కరెన్సీలో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఉంటాయి. అయితే భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన నోట్లు, నాణేలు ఉంటాయి. వీటి విలువ అసలు కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అలాంటి ఒక 10 రూపాయల నోటు గురించి తెలుసుకుందాం.

తాజాగా ఒక 10 రూపాయల నోటు హెడ్‌లైన్స్‌లో ఉంది. ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పాతకాలం నాటిది. దీని వెనుక నెమలి బొమ్మ ఉంటుంది. ఈ నెమలితో ఉన్న 10 రూపాయల నోటు ధర నేడు వేల రూపాయలు పలుకుతోంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి నోటు సంపాదించడం అంత సులువు కాదు. ఈ నోట్లు మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిలో కొన్ని నోట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మిమ్మల్ని ధనవంతులుగా కూడా చేస్తాయి. మీ వద్ద 10 రూపాయల నెమలి నోటు ఉంటే అది మీకు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.

మీరు 10 రూపాయల నెమలి నోటును కలిగి ఉంటే దాని క్రమ సంఖ్య మెరుగ్గా ఉంటే ఆ నోట్ల ధర మరింత పెరుగుతుంది. ఉదాహరణకు ఈ నోటు సీరియల్ నంబర్‌లో 786 సంఖ్య ఉంటే దాని విలువ అధికంగా ఉంటుంది. రూ.30-40 వేల నుంచి దాదాపు లక్షల వరకు ఉంటుంది. ఈ నోట్ మీ వద్ద ఉంటే ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. Ebay, Quikr, Coinbazaar వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వీటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story