Third Party Insurance: కారుకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి.. ఎందుకంటే..?

Third Party Insurance: కారు కొనుగోలు చేయడం ముఖ్యం కాదు దానిని రోడ్డుపైకి తీసుకొస్తున్నప్పుడు అన్ని పత్రాలను కలిగి ఉండడం అవసరం.

Shekhar G
Updated on: 24 Jan 2024 9:30 PM IST
Third-Party Insurance Is Mandatory For The Car Know The Complete Details Why
X

Third Party Insurance: కారుకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి.. ఎందుకంటే..?

Third Party Insurance: కారు కొనుగోలు చేయడం ముఖ్యం కాదు దానిని రోడ్డుపైకి తీసుకొస్తున్నప్పుడు అన్ని పత్రాలను కలిగి ఉండడం అవసరం. భారతీయ మోటారు వాహనాల చట్టం ప్రకారం దేశంలో వాహనాన్ని చట్టబద్ధంగా నడపడానికి ప్రతి వాహన యజమాని కనీసం థర్డ్ పార్టీ బీమా కలిగి ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదంటే రూ. 4,000 నుంచి రూ.లక్ష వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం థర్డ్ పార్టీ కారు బీమాను ఎందుకు తప్పనిసరి చేసింది.. ఇది కారు యజమానులకు ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

పేరుకు సూచించినట్లుగా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ వాహనం వల్ల థర్డ్ పార్టీ లేదా ఆస్తికి ఊహించని నష్టం జరిగితే కవరేజీని అందించే ఒక బీమా వర్గం. ఉదాహరణకు మీ కారు అదుపు తప్పి మరో వాహనంతో ఢీకొంటే ఈ ప్రమాదంలో సంబంధంలేని వ్యక్తికి నష్టం జరిగితే థర్డ్‌ పార్టీ బీమా ద్వారా పరిహారం చెల్లిస్తారు. వ్యక్తిగత నష్టానికి ఇది కవరేజీని అందించదు. కారు చెడిపోయినా, పాడైపోయినా బీమా ప్రొవైడర్ నుంచి ఎలాంటి పరిహారం లభించదు. సొంత జేబు నుంచి రిపేర్‌ చేయించుకోవాల్సిందే.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రతి వాహన యజమానికి తప్పనిసరి చేశారు. ఎందుకంటే ఇది ఏదైనా మూడో పక్షానికి ఊహించని నష్టాలు తగ్గించడంలో సహాయపడుతుంది. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తుంది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో కారు తయారీ, మోడల్ దాని ప్రస్తుత విలువ, పాలసీ రకం, బీమా ప్రొవైడర్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.

థర్డ్ పార్టీ బీమా కొనుగోలు చేయాలంటే కారు బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. ఇది బీమా ప్రీమియంను త్వరగా సులభంగా లెక్కించడంలో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో తగిన ప్లాన్‌ను సులువుగా కొనుగోలు చేయవచ్చు. ఇది త్వరితంగా సరళంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా ఆప్షన్స్‌ ఉంటాయి. అయితే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. కొత్తవారైతే నిపుణుల సాయం తీసుకోవడం ఉత్తమం.

Shekhar G

Shekhar G

Next Story