Chief Election Commission: నూతన సీఈసీ నియామకం.. ఎవరీ జ్ఞానేష్ కుమార్?

Dhivi
Published on: 18 Feb 2025 5:58 AM IST
Chief Election Commission: నూతన సీఈసీ నియామకం.. ఎవరీ జ్ఞానేష్  కుమార్?
X

Chief Election Commission: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరును ప్రకటించారు. జ్ఞానేష్ కుమార్ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రైపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామానికి సంబంధించి నూతన చట్టం ప్రకారం ఈ పదవికి నియమితులైన తొలి సీఈసీగా నిలిచారు జ్ఞానేష్ కుమార్. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జ్ఞానేష్ కుమార్ పేరును ఖరారు చేశారు.

సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ కమిటీ సమావేశం అయ్యింది. సెర్చ్ కమిటీ షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థుల్లో ఒకరి పేరును సిఫార్సు చేసింది. మరోవైపు 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ డాక్టర్ వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నట్లు ప్రకటనలో ఉంది.

ఎవరీ జ్ఞానేష్ కుమార్?

*1988 బ్యాచ్ కు చెందిన కేరళ కేడర్ అధికారి జ్ఞానేష్ కుమార్ గతేడాది జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.

*నూతన సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2022 మే నుంచి అమిత్ షా మంత్రి వర్గంలో కార్యదర్శిగా పనిచేశారు.

*జ్ఞానేష్ కుమార్ మొదట మే 2016 నుంచి సెప్టెంబర్ 2018 వరకు సంయుక్త కార్యదర్శిగా, తర్వాత సెప్టెంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2021 వరకు అదనపు కార్యదర్శిగా హోంశాఖలో 5ఏళ్ల పనిచేశారు.

*2019ఆగస్టులో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పుడు అదనపు కార్యదర్శిగా జమ్ముకశ్మీర్ డెస్క్ కు నేత్రుత్వం వహించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షాతో కలిసి ఆయన పార్లమెంట్ కు వెళ్లేవారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

* సుఖ్ బీర్ సింగ్ సంధుతోపాటు జ్నానేశ్ కుమార్ గతేడాది మార్చ్ లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.

*కాన్పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పట్టా పొందారు. కుమార్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు.

Dhivi

Dhivi

Next Story