పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు.. ఆర్‌బీఐ నిర్ణయాలే కారణం!

పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు.. ఆర్‌బీఐ నిర్ణయాలే కారణం!
x
BSE (file image)
Highlights

దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు (ఏప్రిల్ 17) పరుగులు తీశాయి. కరోనా ఎఫెక్ట్ తో ఒడిదుడుకుల్లో ఉన్న స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు ఉఉతం...

దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు (ఏప్రిల్ 17) పరుగులు తీశాయి. కరోనా ఎఫెక్ట్ తో ఒడిదుడుకుల్లో ఉన్న స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు ఉఉతం ఇచ్చాయి. ఆర్‌బీఐ రివర్స్ రేపో రేటు కోత తో పాటుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ఈ నిర్ణయాల కారణంగా బ్యాంకులకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వస్తాయి.

ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమే లాభాలతో మొదలైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వెలువడటంతో పాటు బ్యాంకులకు ఊతమిచ్చే చర్యలు ఉంటాయనే అంచనాలతో ఈరోజు మంచి ఆరంభం లభించింది.

ఉదయం సెన్సెక్స్ 1,063.78 పాయింట్లు (3.48%) పెరిగి 31,666.39 వద్ద, నిఫ్టీ 309.50 పాయింట్లు(3.44%) ఎగిసి 9,302.30 వద్ద ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1116 పాయింట్లు లాభంతో 31,719 పాయింట్ల గరిష్టాన్ని చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 331 పాయింట్ల లాభంతో 9324 పాయింట్ల గరిష్టానికి చేరింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్ద, నిఫ్టీ 294 పాయింట్ల లాభంతో 9287 పాయింట్ల వద్ద నిలిచాయి.

- నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే, హెయూఎల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ హీంద్రా, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.

-అంతర్జాతీయంగా షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో మార్కెట్ల షేర్లు లాభాల్లో ఉండటం కూడా మన స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి కారణంగా నిలిచింది.

- అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.34 శాతం పెరుగుదలతో 28.77 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.98 శాతం క్షీణతతో 19.09 డాలర్లకు తగ్గింది.

- అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 46 పైసలు లాభంతో 76.40 వద్ద కదలాడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories