కాఫీడే తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌

K V D Varma
Published on: 31 July 2019 4:29 PM IST
కాఫీడే తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌
X

కాఫీడే ఛైర్మన్ సిద్ధార్థ ఆకస్మిక మృతితో సంస్థ డైరెక్టర్లు షాక్ కు గురయ్యారు. అయితే, అయన మరణంతో సంస్థ బాధ్యతలు చూడడం కోసం తాత్కాలికంగా కంపెనీ బాధ్యతలను బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరైన రంగనాథ్‌కు అప్పగించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు సిద్ధార్థ రాసినట్టుగా ప్రచారంలో ఉన్న లేఖ విషయం ఈ సందర్భంగా బోర్డు సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ లేఖ అస్పష్టంగా ఉందనీ, దీనిపై దర్యాప్తు జరపాలనీ బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, సిద్ధార్థ మృతి పట్ల దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

K V D Varma

K V D Varma

Next Story