Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు..

Stock Markets Ended With Huge Gains
x

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు.. 

Highlights

Stock Market: నిఫ్టీ 156.35 పాయింట్ల లాభం

Stock Market: దేశీయ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌ కనిపించింది. ఎన్నికల వేళ ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాల జోలికి పోకపోవడం మదుపరులను ఆకర్షించింది. మూలధన వ్యయానికి కేటాయింపులు పెంచడం మెప్పించింది. ముఖ్యంగా రిలయన్స్‌, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు..

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో ఓ మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 71వేల 977 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 14 వందల పాయింట్లకుపైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. చివరికి 440.33 పాయింట్ల లాభంతో 72 వేల 85 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.35 పాయింట్ల లాభంతో 21 వేల 853.80 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories