Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 123 పాయింట్లు, 36పాయింట్ల నష్టం

Jyothi
Updated on: 10 Feb 2023 8:15 PM IST
Stock Market Updates Today
X

Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదేబాటలో నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. కంపెనీల షేర్ల వెయిటేజీ సమీక్ష నష్టాలకు కారణమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 60వేల 682కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 17వేల 856 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82పాయింట్ 58 వద్ద నిలిచింది.

Jyothi

Jyothi

Next Story