Stock Market: మార్కెట్లపై అదానీ ఎఫెక్ట్‌.. 1200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

Stock Market: 325 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ.. 59 వేల దిగువన ట్రేడ్‌ అవుతున్న మార్కెట్‌

Jyothi
Published on: 27 Jan 2023 4:37 PM IST
Stock Market Updates Sensex lost 1200 pts Nifty lost 325 pts
X

Stock Market: మార్కెట్లపై అదానీ ఎఫెక్ట్‌.. 1200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 1200 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 325 పాయింట్లు కోల్పోవడంతో 59 వేల దిగువన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అదానీ షేర్ల పతనం కారణంగా మదుపర్లు నష్టాల్లో మునిగిపోయారు. షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికే నష్టాలకు కారణంగా నిపుణులు తెలిపారు. అదానీ షేర్ల నష్టంతో పాటు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు, బడ్జెట్‌ ముందస్తు అంచనాలు, బాండ్ల రాబడుల్లో పెరుగుదల, చమురు ధరలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story