Stock Market: లాభాల బాటన దేశీ ఈక్విటీ మార్కెట్ల దూకుడు

Stock Market: బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 54 వేల పాయింట్ల వద్ద రికార్డ్ * అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం

Sandeep Eggoju
Published on: 4 Aug 2021 10:17 AM IST
Stock Market Today India Nifty Started With 116 Points Sensex 420 Points 4th August 2021
X

Representational Image 

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి..బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 54 వేల పాయింట్ల వద్ద సరికొత్త రికార్డ్ ను నమోదు చేయగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలక 16 వేల మార్క్‌ను దాటి పరుగులు పెడుతోంది. కోవిడ్ మహమ్మారితో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు, తయారీ రంగ కార్యకలాపాలు మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు 33 శాతం పుంజుకోవడం తదితర అంశాలు మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 54,244 వద్దకు చేరగా... నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 16,247 వద్ద కదలాడుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story