Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: నష్టాలకు దోహదం చేసిన అదానీ కంపెనీల షేర్లు

Jyothi
Published on: 13 Feb 2023 5:16 PM IST
Stock Market Sensex Ends over 250 pts Lower
X

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకొని రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలను కలవరపర్చాయి. దీనికి దిగ్గజ కంపెనీల షేర్ల పతనం తోడైంది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు సైతం సూచీల నష్టాలకు దోహదం చేశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 438 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 250.86 పాయింట్ల నష్టంతో 60వేల431.84 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 85.60 పాయింట్లు నష్టపోయి.. 17వేల 770.90 వద్ద ముగిసింది.

Jyothi

Jyothi

Next Story