Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు

Jyothi
Updated on: 28 Dec 2022 9:30 PM IST
Stock Market Sensex Ends flat after Volatile Session Nifty
X

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో అప్ అండ్ డౌన్ అవుతూ చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే కోలుకున్నాయి. కానీ, వెంటనే కొనుగోళ్ల తాకిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇలా రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. రెండు రోజుల లాభాలవల్ల మదుపర్లు లాభాలను స్వీకరించడం అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, రూపాయి బలహీనతలు కూడా సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ 17.15 పాయింట్ల స్వల్ప నష్టంతో 60వేల910.28 దగ్గర, నిఫ్టీ 9.80 పాయింట్ల నష్టంతో 18వేల122.50 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.82 వద్ద నిలిచింది.

Jyothi

Jyothi

Next Story