Stock market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు ..

Stock market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగసి 49,206 వద్ద క్లోజ్

Sandeep Eggoju
Updated on: 7 May 2021 5:35 PM IST
Stock Market News Today India With Nifty 98 Points Sensex at 256 Points 07 05 2021
X

Representational Image

Stock market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి వీకెండ్ సెషన్ లో సానుకూల బాటన ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు .. మిడ్‌ సెషన్‌ నుంచి లాభాల స్వీకరణ కారణంగా పరిమిత లాభాల్లో ముగిశాయి..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగసి 49,206 వద్దకు చేరగా , నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 14,823 వద్ద స్థిరపడ్డాయి. అయితే కొవిడ్‌ కేసుల పెరుగుదల, స్థానిక లాక్‌డౌన్‌లు, నెమ్మదించిన వ్యాక్సినైజేషన్ ప్రక్రియ వంటి అంశాలు కొద్దిమేర ప్రతికూల ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story