Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలు

Stock Market: సెన్సెక్స్‌ 557 పాయింట్లు ఎగసి 48,944 వద్ద క్లోజ్

Sandeep Eggoju
Published on: 27 April 2021 4:55 PM IST
Stock Market News Today India With Nifty 557 Points Sensex at 168 Points Today 27 04 2021
X

Representational Image

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజావారం మలి సెషన్ లో సానుకూల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 557 పాయింట్లు ఎగసి 48,944 వద్దకు చేరగా నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 14,653 వద్ద స్థిరపడ్డాయి.

దేశీయంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకోవడం, 18 ఏళ్లు పైబడ్డ వారికి టీకాల కార్యక్రమం షురూ కానున్నదన్న సమాచారంతో మార్కెట్ సెంటిమెంట్‌ మెరుగైనట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story