Petrol Price: వరుసగా ఆరో రోజు నిలకడగా పెట్రో ధరలు

Petrol Price: సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు..

Sandeep Eggoju
Updated on: 5 March 2021 10:40 AM IST
Sixth day of Petrol Price Stable
X

Representational Image

Petrol Price: దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి.. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది ఢిల్లీ, ముంబై సహీ దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ఈ నేపధ్యంలో ఆదాయ లక్ష్యాన్ని ప్రభావితం చేయకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 8.5 రూపాయల మేర తగ్గించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి .. హైదరాబాద్ , విశాఖల్లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు..డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story