Stock Market: తొలిసారి 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 July 2024 9:15 PM IST
Sensex Hits Historic 80,000-mark, Nifty Ends at Record High
X

Stock Market: తొలిసారి 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 80వేల మార్కును అందుకుంది. ఇంట్రాడేలో 80 వేల 74 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ సైతం 24 వేల 307 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది.

నెల రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 3 వేల 413 పాయింట్ల లాభంతో దూసుకుపోయింది. ఇటీవలే 75 వేల మార్కును అందుకున్న సెన్సెక్స్ కేవలం 57 రోజుల్లోనే 80 వేల మార్కును చేరుకుంది. 79 వేల 986 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 162పాయింట్లు లాభపడి 24 వేల 286 వద్ద ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story